మలయాళం లో భయపెడుతోన్న తమన్నా
on Aug 17, 2019

ఇంతవరకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో తన గ్లామర్ తో అలరించిన తమన్నా త్వరలో మలయాళం లో కూడా అలరించబోతుందట. అది కూడా ఒక హారర్ సినిమా తో మలయాళం లో ఎంట్రీ ఇస్తోంది ఈ గ్లామర్ బ్యూటీ. ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే ... సంధ్య మీనన్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్లాన్ జరుగుతోందట. సెంట్రల్ జైల్ నేపథ్యం లో జరిగే కథాశంతో ఈ సినిమా తెరకెక్కుతోందట. దీనికి `సెంట్రల్ జైలిలే దెయ్యం ` అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో తమన్నా అందంతో పాటు అభినయం ప్రదర్శించే పాత్ర దక్కినట్లు సమాచారం. ప్రెసెంట్ తమన్నా సైరా లో క్యారక్టర్ చేసింది. ఈ సినిమా అక్టోబర్ 2 న రిలీజ్ కి రెడీ అవుతోంది. త్వరలో తమన్నా మళయాలం సినిమా కు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశాలున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



