రేప్‌కు గురైన ప్రముఖ తెలుగు టీవీ యాక్ట్రెస్
on Jun 22, 2017

బ్యూటిషన్ శిరీష ఉదంతం మరిచిపోక ముందే, ఒక ప్రముఖ తెలుగు టీవీ యాక్ట్రెస్ కిడ్నాప్ మరియు రేప్ కేసు హైదరాబాద్ నగరంలో సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ లోని వనస్థలిపురంలో నివసించే ఒక టీవీ యాక్ట్రెస్ ని అనంతపూర్ కి చెందిన గిరీష్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసి పలుమార్లు రేప్ చేసాడు. ఈ వార్తని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్ భగవత్ మీడియాకి బహిర్గతం చేసారు. పోలీసుల కథనం ప్రకారం, గిరీష్ అనే వ్యక్తి టీవీ యాక్ట్రెస్ న్యూడ్ ఫొటోస్, వీడియోస్ ఆమెకి తెలియకుండా తీసి తన కోరిక తీర్చకపోతే అవి నెట్లో పెడతానని బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో గిరీష్ ఆ టీవీ యాక్ట్రెస్ ని కిడ్నాప్ చేసి అనంతపూర్ కి ఎత్తుకెళ్లాడు. తర్వాత ఆ అమ్మాయి మీద పలుమార్లు అత్యాచారం చేసాడు.
ఎలాగోలా ఆ వంచకుడి నుండి తప్పించుకొని హైదరాబాద్ వచ్చిన టీవీ యాక్ట్రెస్ రాచకొండ పోలీస్ కమీషనర్ కి మొత్తం వివరించింది. కమీషనర్ ఆర్డర్ అందుకున్న ఎల్ బీ నగర్ పోలీసులు అనంతపూర్ కి వెళ్లి గిరీష్ ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తీసుకు వచ్చారు. ఈ ఉదంతం గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గ్లామర్ ప్రపంచం ఎంత భయంకరమైందో చెప్పడానికి ఈ దుర్ఘటనే నిలువెత్తు సాక్షి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



