రజినీకాంత్ కాలా సెట్లో ప్రమాదవశాత్తూ కార్మికుడి మృతి
on Jun 22, 2017
.jpg)
సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం పా రంజిత్ దర్శకత్వంలో కాలా అనే మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. వీరిరువురి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. మొదటి చిత్రం కబాలి ఒక మోస్తరుగా ఆడినా, కథ నచ్చడంతో రజినీకాంత్ కాలా చేయడానికి ఓకే చెప్పాడు. తన అల్లుడు, ప్రముఖ తమిళ నటుడు ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. అయితే, కాలా చిత్రంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ముంబైలోని ధారవీ ప్రాంతంలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ కోసం చెన్నైలోని హుండమల్లి ప్రాంతంలో ఒక భారీ సెట్ నిర్మిస్తోంది. అయితే, ఈ సెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా, అందులో పాల్గొన్న ఒక సినీ కార్మికుడు ప్రమాదవశాత్తూ విద్యుతాఘాతంతో మృతి చెందాడు. ఈ దుర్ఘటనతో సినిమా యూనిట్ మొత్తం విషాదంలో మునిగిపోయింది. తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అని కోరుకునే రజినీకాంత్, ఈ సంఘటనపై ఎలా స్పందిస్తాడో చూడాలి. అది కాకుండా త్వరలో రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశ్యంతో ఉన్నాడు కదా మన సూపర్ స్టార్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



