జులై 21.. టాలీవుడ్ కి చాలా కీలకం!
on Jul 18, 2022

అధిక నిర్మాణ వ్యయం మరియు ఇతర సమస్యలపై చర్చించి అవన్నీ ఓ కొలిక్కి వచ్చేవరకు షూటింగ్స్ నిలిపివేసే ఆలోచనలో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది.
ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించేందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జులై 21న(గురువారం) స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్ ని నిర్వహించనుంది. ఈ మేరకు తాజాగా ప్రకటన వచ్చింది. నిర్మాతల మండలిలోని సభ్యులు హాజరు కానున్న ఈ సమావేశంలో ఓటీటీ, టికెట్ ధరలు, నిర్మాణ వ్యయం తదితర అంశాలపై చర్చించనున్నారు.

కొంతకాలంగా ప్రేక్షకులు థియేటర్స్ కి రాక మెజారిటీ సినిమాలు కమర్షియల్ ఫెయిల్యూర్స్ గా మిగిలిపోతున్నాయి. అందుకే 'థియేటర్స్ లో విడుదలైన పది వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్', 'ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా టికెట్ ధరలు' వంటి అంశాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే నిర్మాణ వ్యయం తగ్గించడం కోసం రెమ్యునరేషన్స్, వర్కింగ్ డేస్ తగ్గించడంతో పాటు.. కాల్ షీట్ టైమింగ్స్ ఛేంజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



