`సైరా ` మేకింగ్ వీడియోకు వేళాయే
on Aug 13, 2019
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తొలి తరం స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగు నేలపై స్వాతంత్య్ర సమర శంఖం పూరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఈ రోజు చిత్ర యూనిట్ అధికారికంగా విడుదల చేసింది. అదేమిటంటే ... ఈ నెల 14 న అంటే... రేపు సాయంత్రం 3 గంటల 45 నిముషాలకు `సైరా ` సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో రిలీజ్ చేయనున్నారు. అలాగే ట్రైలర్ కూడా చాల గ్రాండ్ గా `సాహో ` సినిమాతో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు హిందీ , కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
Also Read