ఖరారు: వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో రాజశేఖర్
on Aug 13, 2019

'కల్కి' తర్వాత డాక్టర్ రాజశేఖర్ చేసే సినిమా ఏంటి? ఆయనను అభిమానించే వాళ్లను తొలుస్తున్న ప్రశ్న ఇది. దానికి సమాధానం లభించింది. వీరభద్రమ్ చౌదరి డైరెక్షన్‌లో నటించడానికి రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వీరభద్రమ్ చెప్పిన కథ ఆయనకు బాగా నచ్చిందనీ, వెంటనే సినిమా చేయడానికి అంగీకారం తెలిపారనీ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో మరో యంగ్ హీరో కూడా ఉంటాడని తెలుస్తోంది. ఇంకా ఆ హీరో ఎంపిక పూర్తి కాలేదు. వీరభద్రమ్ డైరెక్షన్‌లో 'చుట్టాలబ్బాయి' మూవీని నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. 'చుట్టాలబ్బాయి' తర్వాత రామ్ 'నేల టిక్కెట్టు' సినిమా తీశారు. ఇప్పుడు రవితేజతోటే 'డిస్కో రాజా'ని నిర్మిస్తున్నారు.
కాగా రాజశేఖర్, వీరభద్రమ్ కాంబినేషన్ మూవీ ఈ నెలలోనే లాంఛనంగా మొదలవనున్నది. సెప్టెంబర్‌లో సెట్స్ మీదకు వెళ్లనున్నది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తయారవుతుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



