సైరా నరసింహారెడ్డీ... అదిరిందయ్యా మోషన్ పోస్టర్!
on Aug 22, 2017

నిర్జీవంగా మిగిలిన బ్రిటీష్ కోట... తగలబడిపోతున్న బ్రిటీష్ పతాకం... తెగిపడిన తెల్లవాళ్ల శరీరకండాలు... తగలిపోడుతున్న కోట పరిసరాలు... ‘సైరా... నరసింహారెడ్డీ.... ’అంటూ జయజయ ధ్వానాలు... ఆయుధధారై నిర్జీవమైన కోట వంక... నిప్పులు కక్కుతూ చూస్తున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. మొత్తంగా ఇదీ... ‘సైరా నరసింహారెడ్డి’మోషన్ పోస్టర్ విశేషాలు.
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరగాధకు తెరరూపం ఇస్తూ... మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ఈ ప్రయత్నంపై కోట్లాది అంచనాలున్నాయ్. ఆ అంచనాలను వంద వంతులు పెంచేలా ఉంది ఈ మోషన్ పోస్టర్. ఈ సినిమా టైటిల్ పై ఉన్న ఉత్కంఠ మొత్తం నేటితో తీరిపోయింది. ‘సైరా నరసింహారెడ్డి’ అనే టైటిల్ ఈ సినిమాకు ఖరారైంది.
ఇందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువుగా కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనుండటం విశేషం. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార ఇప్పటివరకూ ఎంపికైన తారాగణం. మరో కథానాయిక పాత్రను ఐశ్వర్య రాయ్ తో నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయ్. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు పనిచేయనున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, పరుచూరి బ్రదర్స్ రచన అందిస్తుండగా, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని వెసవి కానుకగా విడుదల చేయానలేది మెగాస్టార్ ఆలోచన.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



