'ఉయ్యాలవాడ' వివాదం అప్పుడే మొదలైంది...
on Aug 22, 2017

చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా `సైరా నరసింహరెడ్డి` మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందుతున్న ఈ సినిమాకు సైరా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక మోషన్ పోస్టర్ చూసి మెగా అభిమానులు ఆనందపడే లోపే మరో తలనొప్పి మొదలైంది. సినిమా పేరు అలా మార్చారో లేదో అప్పుడే వివాదం స్టార్ అయింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిత్రం తీస్తూ, ఆయన పేరును పెట్టకుండా 'సైరా' అనే పేరును విడుదల చేయడంపై ఉయ్యాలవాడ వంశస్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్రం టైటిల్ పై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, దీనిపై ఫిర్యాదు చేస్తామని రాయలసీమలో ఇప్పటికీ ఉన్న ఉయ్యాలవాడ వారసులు అంటున్నారు. అంతేకాదు వెంటనే చిత్ర టైటిల్ ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎంత వరకూ వెళుతుందో చూద్దాం.
కాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా రూపొందుతుంది. ఈ సినిమాను చిరు తనయుడు రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నాడు. ఇంకా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా రవివర్మన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, సీనియర్ హీరో జగపతి బాబు, సాండల్ వుడ్ స్టార్ సుధీప్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి, ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడిగా నటిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



