మెగాస్టార్ ఖాతాలో మరో రికార్డ్
on Jul 1, 2019
'పాట వచ్చి పదేళ్లు అయింది. కానీ, పవర్ ఏమాత్రం తగ్గలేదు' - 'గబ్బర్ సింగ్'లో పవన్ ను ఉద్దేశిస్తూ అలీ చెప్పే డైలాగ్. 'ఖైదీ నంబర్ 150' విడుదల తర్వాత మెగా అభిమానులు ఇదే డైలాగ్ ను కొంచెం మార్చి చెప్పారు. 'మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చి పదేళ్లు అయింది. కానీ, ఆయన పవర్ ఏమాత్రం తగ్గలేదు' అన్నారు. 'ఖైదీ నంబర్ 150' వంద కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. ఆ సినిమా తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా 'సైరా నరసింహారెడ్డి'. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. సైరా కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 35 కోట్లకు అమ్ముడయ్యాయి. ఓ తెలుగు సినిమా కర్ణాటక థియేట్రికల్ రైట్స్ లో ఇదే హైయెస్ట్ రికార్డ్. బాహుబలి రైట్స్ కూడా అంతకంటే తక్కువకు అమ్ముడయ్యాయి. అయితే... ఎక్కువ వసూళ్లు సాధించింది. సైరా ఎంత వసూలు చేస్తుందో చూడాలి. తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు వాడు అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మెగాస్టార్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తిచేసారు. త్వరలో సినిమా ట్రైలర్ విడుదల చేసి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.