దొరసాని ట్రైలర్: మూతిముద్దే హైలైట్!
on Jul 1, 2019
'దొరసాని'తో కథానాయికగా పరిచయమవుతున్న శివానీ రాజశేఖర్ తొలి సినిమాతోనే మూతిముద్దులు పెట్టడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పకనే చెప్పింది. విజయ్ దేవరకొండ తనయుడు ఆనంద్ దేవరకొండను హీరోగా, కేవీఆర్ మాహేంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ... సురేష్ బాబు దగ్గుపాటి సమర్పణలో మధుర శ్రీధర్, యశ్ రంగినేని నిర్మించిన సినిమా 'దొరసాని'. ఈ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ప్రేమకథకు, మావోయిస్టు ఉద్యమానికి ముడిపెడుతూ సినిమా తీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. అయితే... ఆ ప్రేమకథ కొత్తగా ఏమీ లేదు. కోటలోని రాణితో తోటమాలితో ప్రేమలో పడితే ఏం జరిగిందనేది సినిమా. 80వ దశకంలోని తెలంగాణ నేపథ్యం ఈ కథకు కొత్త కళ తీసుకొచ్చింది. మోడ్రన్ కల్చర్ కథల్లో లిప్ కిస్సులు కామన్ అయిన ఈ రోజుల్లో.... 40 ఏళ్లు వెనక్కి వెళ్లి, అప్పటి కథతో తీసిన సినిమాలో మూతి ముద్దు పెట్టడం ఆశ్చర్యమే. అంటే... మూతిముద్దును డైరెక్టుగా చూపించలేదు గానీ, లిప్ కిస్ పెట్టినట్టు అందరికీ అర్థమైంది. తర్వాత శివానీ బుగ్గపై ఆనంద్ ముద్దు పెడతాడు. ఆ ముద్దులే ఈ ట్రైలర్ కి హైలైట్ అయ్యాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి.