మా నాన్నవిజయ్ సేతుపతి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు.. నువ్వు చిరంజీవివి
on Aug 9, 2025

'మక్కల్ సెల్వం విజయ్ సేతుపతి'(Vijay Sethupathi)రీసెంట్ గా 'సార్ మేడమ్'(Sir Medam)అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తమిళ, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి(Surya Sethupathi)తన తండ్రి నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తు 'ఫీనిక్స్'(Phoenix)అనే మూవీతో సిల్వర్ స్క్రీన్ పై మెరిశాడు. జులై 4 న తమిళంలో రిలీజైన 'ఫీనిక్స్' మంచి టాక్ ని సొంతం చేసుకుంది.
ఇప్పుడు ఈ మూవీ తెలుగులో 'ఫీనిక్స్' చిరంజీవి అనే టాగ్ లైన్ తో రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ' సూర్య సేతుపతి తో పాటు చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా సూర్య మీడియాతో మాట్లాడుతు మా నాన్న ఫీనిక్స్ కి సంబంధించి ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. నేను దర్శకుడు ప్లాన్ చేసుకొని ఈ చిత్రాన్ని చేసాం. నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. స్టంట్స్ కి సంబంధించి సంవత్సరంన్నర ట్రైనింగ్ తీసుకొన్న తర్వాతే మూవీని స్టార్ట్ చేసాం. ఎమోషనల్ సీన్స్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేసానని సూర్య చెప్పుకొచ్చాడు. రిలీజ్ డేట్ పై త్వరలోనే ప్రకటన రానుంది.
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఫీనిక్స్ లో సూర్య సరసన వర్ష విశ్వనాధ్ జత కట్టగా వరలక్ష్మి శరత్ కుమార్, దేవదర్శిని, జె విగ్నేష్ కీలక పాత్రల్లో కనిపించారు. అనల్ అరసు( Anal Arasu) దర్శకత్వంలో ఏకె బ్రేవ్ మెన్ పిక్చర్స్ నిర్మించింది. మహావతార్ నరసింహ ఫేమ్ సామ్ సి ఎస్ మ్యూజిక్ ని అందించాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



