ఆ ప్రచారాన్ని నమ్మొద్దు.. చిరంజీవి కీలక ప్రకటన!
on Aug 9, 2025

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో కార్మిక సంఘాలు వర్సెస్ నిర్మాతలు అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. కార్మికుల వేతనాలు 30 శాతం పెంచకపోతే షూటింగ్స్ లో పాల్గొనేది లేదని ఫెడరేషన్ ప్రకటించింది. అయితే నిర్మాతలు మాత్రం ఒకేసారి అంత మొత్తం పెంచడానికి సిద్ధంగా లేరు. దీంతో ఫిల్మ్ ఛాంబర్ రంగంలోకి దిగి.. దీనికి పరిష్కారం వెతికే పనిలో ఉంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. 30 శాతం పెంపు డిమాండ్ ని నెరవేరుస్తానని ఫెడరేషన్ సభ్యులకు మెగాస్టార్ చిరంజీవి హామీ ఇచ్చినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి కీలక ప్రకటన చేశారు. (Chiranjeevi)
"ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు.. నేను వారిని కలిసి 30 శాతం వేతన పెంపు డిమాండ్ ను నెరవేర్చడంతో పాటు, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తానని హామీ ఇచ్చానని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. నాతో సహా ఏ వ్యక్తి కూడా ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఏకపక్ష హామీలు ఇవ్వలేరు. ఫిల్మ్ ఛాంబర్ అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అత్యున్నత సంస్థ. ఫిల్మ్ ఛాంబర్ మాత్రమే సమిష్టిగా సంబంధిత వారందరితో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారాన్ని కనుగొంటుంది. అప్పటి వరకు, ఇటువంటి నిరాధారమైన ప్రచారాలను నమ్మకండి. ఈ ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను." అని చిరంజీవి తెలిపారు.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



