కోలీవుడ్ స్టార్ చూపు పది భాషలపై పడింది!
on Dec 30, 2022

కోలీవుడ్ విలక్షణ నటులలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కమలహాసన్, రజినీకాంత్, విక్రమ్ తర్వాత సూర్య పేరును కచ్చితంగా చెప్పుకోవాలి. సూర్య చిత్రాలు ఎంతో విభిన్నంగా ఉంటాయి. ఆయన నటించిన 'పితామగన్' మూవీ 'శివపుత్రుడు'గా విడుదలై సంచలనం సృష్టించింది. 'కాకా కాకా' చిత్రం తెలుగులో వెంకటేష్ హీరోగా 'ఘర్షణ' పేరుతో రీమేక్ అయింది. ఆ తర్వాత సుందరాంగుడు, యువ, సెవెన్త్ సెన్స్, గజిని, 24, ఆకాశం నీ హద్దురా వంటి చిత్రాలు నిజానికి పాన్ ఇండియా రేంజ్ చిత్రాలనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన మురుగదాస్‌తో చేసిన 'సెవెన్త్ సెన్స్' చిత్రం కరోనా సమయంలో గానీ ఇప్పుడు గానీ వచ్చి ఉంటే ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆ మూవీకి బ్రహ్మరథం పట్టేవారు.
ప్రస్తుతం ఆయన హీరోగా శివ దర్శకత్వంలో 'సూర్య42' అనే వర్కింగ్ టైటిల్ తో ఓ భారీ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీని పిరియాడికల్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇంతకాలం తన ప్రతి సినిమాను ఒక ప్రయోగంగా చూపిన సూర్య ఈ సినిమాను ఎక్స్పరిమెంటల్ గా హై లెవెల్ లో తీస్తున్నట్టు తెలుస్తోంది. సూర్య42 సినిమా గురించి లేటెస్ట్ న్యూస్ వింటే అది అందరిని ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ఈసారి ఆయన విజువల్ వండర్ గా తన సినిమాని ప్లాన్ చేస్తున్నారట. ఈ మూవీలో సూర్య ఏకంగా 13 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఒక్కో గెటప్ కోసం సూర్య గంటల కొద్దీ టైం తీసుకుంటున్నా సరే ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు అలా ఫిక్స్ అయ్యారట.
ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్క్రిప్ట్ దశ నుంచే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని, అన్ని భాషల వారిని మెప్పించి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతుందని సూర్య ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ అందాల భామ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఇండియన్ స్క్రీన్ మీద చాలా పీరియాడికల్ స్టోరీస్ వచ్చాయి. 'బాహుబలి' వంటి ఫిక్షనల్ స్టోరీకి కూడా మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా కోలీవుడ్ నుంచి వచ్చిన 'పొన్నియన్ సెల్వన్ 1' మూవీ ఒక సంచలనం సృష్టించింది. సూర్య 42వ చిత్రం కూడా వాటి సరసన నిలుస్తుందని ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



