సురేష్ ప్రొడక్షన్స్ చేతికి 'మానాడు' రీమేక్ రైట్స్
on Jan 6, 2022

తమిళ్ సూపర్ హిట్ మూవీ 'మానాడు' తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.
శింబు, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'మానాడు'. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్ 25న విడుదలై.. 2021లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా కోలీవుడ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. 'ది లూప్' పేరుతో తెలుగులో కూడా నవంబర్ 25న విడుదల కావాల్సిన మానాడు కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్‌తో పాటు అన్ని భాషల రీమేక్ హక్కులను సురేష్ ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. తెలుగు వర్షన్ సినిమాకు ఏసియన్ సినిమాస్ కూడా భాగస్వామ్యం వహించనుంది.

మానాడు తెలుగు వెర్షన్ థియేట్రికల్ విడుదలతో పాటు, మిగతా భాషల్లో రీమేక్ కి సంబంధించిన వివరాలను సురేష్ ప్రొడక్షన్స్ త్వరలోనే ప్రకటించనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



