సందడి చేసిన ‘sunset with charlie’ టీం
on Jun 7, 2022

నిహారిక కొణిదెల ఇటీవల రియాలిటీ షోస్ కి, మూవీస్ కి కాస్త బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయ్యింది. కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా ఆక్ట్ చేసిన "777 చార్లీ" మూవీ రిలీజ్ కి దగ్గర పడేసరికి ఈ మూవీపై క్రేజ్ పెంచడానికి ప్రొమోషన్స్ మొదలు పెట్టింది టీం. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఈ ఇంటర్వ్యూకి మెగా డాటర్ హోస్ట్ అన్నమాట. ఇందులో నిహారిక మంచి జోష్ తో తన నవ్వుతో అందరిని అలరించింది.
"sunset with charlie " టీంతో ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిహారిక మళ్ళీ ఇంత ఆక్టివ్ రోల్ చేస్తుండడంపై మెగా ఫాన్స్ అంతా ఫుల్ కుష్ లో ఉన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూ లో దగ్గుబాటి రానా , రక్షిత్ శెట్టి, చార్లీ, సంగీత కనిపించారు. ఈ చిత్రం ఒక కుక్క చుట్టూ తిరిగే కథ. సాధారణంగా మూగ జీవాలపై వచ్చే కథలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ వచ్చే కొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి. ఎందుకంటే చాలామంది మనస్సులో ఎదో ఒక మూల ఇలాంటి మూగ జీవాలపై ఉండే ప్రేమే ఈ మూవీస్ హిట్ అవడానికి కారణం కూడా . ఇక ఈ మూవీ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 10 th న రిలీజ్ కానుంది. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



