అనుష్కని మించి డిమాండ్ చేస్తుంది.. అది సన్నీ క్రేజ్ అంటే..
on Dec 18, 2017
తెలుగులో ప్రస్తుతానికి హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ ఎవరు అంటే అనుష్క శెట్టి. బాహుబలి సిరీస్ లో చేసినందుకు గాను ఒక్కో పార్ట్ కి 2 .5 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకుంది. బాహుబలి దెబ్బకి అనుష్కకి ఎన్నో ఆఫర్లు వచ్చినా దక్షిణాదిని వదలనని భీష్మించుకు కూర్చుంది. అయితే, ఒక బాలీవుడ్ హీరోయిన్ సౌత్ సినిమాకు అనుష్కని మించిన సాలరీ డిమాండ్ చేస్తుంది. పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ అవతారం ఎత్తిన సన్నీ లియోన్ సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించింది. గరుడ వేగలో ఒక ఐటెం సాంగ్ కు గాను, సన్నీ లియోన్ తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా 60 లక్షలు అంటే ఆమెకు ఉన్న డిమాండ్ అర్ధం చేసుకోవచ్చు.
ఈ మధ్యే సన్నీ లియోన్ ఒక బహుభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీర నారి అయిన ఒక రాజకుమారి జీవిత చరిత్రని ఆధారం చేసుకొని నిర్మించనున్న ఈ చిత్రానికి గాను సన్నీ డిమాండ్ చేసిన మొత్తం 3 .25 కోట్ల. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు గనుక సన్నీ కి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సుముఖత వ్యక్తం చేశారట. ఇవన్నీ పక్కన పెడితే, సన్నీ లియోన్ కి సౌత్ లో ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు అంత మొత్తం ఇవ్వడానికి అంగీకరించారని తెలిసింది. ఫిబ్రవరి లో షూటింగ్ స్టార్ట్ అవుతుందట.