రెండవ స్థానానికి పరిమితమయిన పవన్ కళ్యాణ్
on Dec 18, 2017
టాలీవుడ్ లో టాప్ స్టార్ ఎవరు అంటే ఠక్కున చెప్పే సమాధానం పవన్ కళ్యాణ్ అని. మరి పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ అంటే... అది సెన్సేషన్స్ క్రియేట్ చేయాల్సిందే... సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వాల్సిందే... యూట్యూబ్ లో వ్యూస్ జాతర జరగాల్సిందే... మొన్నా సాయంత్రం విడుదలయిన అజ్ఞాతవాసి టీజర్ కూడా పైన చెప్పిన అన్ని పనులు చేసింది. విడుదలయిన కేవలం 24 గంటల్లోనే 6 .4 మిలియన్ వ్యూస్ సంపాదించింది. నిస్సందేహంగా ఈ గణాంకాలు టాలీవుడ్ లో టాప్. ఎన్టీఆర్ జై లవ కుశ, మహేష్ బాబు స్పైడర్ టీజర్ లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే, సౌత్ ఇండియా లో మాత్రం అజ్ఞాతవాసి రెండవ స్థానానికి పరిమితమయింది.
ఎందుకంటే, తమిళ్ హీరో విజయ్ మెర్సల్ ఇప్పటికీ టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది. విడుదలయిన ఒక రోజులో మెర్సల్ టీజర్ కి 11 .2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక అజ్ఞాతవాసి టీజర్ విషయానికి వస్తే, అభిమానులకి కావాల్సిన అన్ని సరుకులు సమపాళ్లలో ఉన్నాయి. అందుకే, తమ హీరోని ముచ్చట తీరేంత సేపు చూసారు అభిమానులు. దాని ఫలితమే ఈ వ్యూస్ జాతర.