హిందీకి వెళుతున్న మరో తెలుగు దర్శకుడు
on May 16, 2020

దర్శకుడు క్రిష్ జాగర్లమూడి హిందీలో 'గబ్బర్', 'మణికర్ణిక' సినిమాలకు దర్శకత్వం వహించారు. 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన సినిమాను హిందీలో 'కబీర్ సింగ్'గా రీమేక్ చేశాడు. 'జెర్సీ' వంటి ఎమోషనల్ ఫ్యామిలీ బేస్డ్ స్పోర్ట్స్ డ్రామా తీసిన గౌతమ్ తిన్ననూరికి హిందీలోనూ ఆ కథను తెరకెక్కించే అవకాశం వచ్చింది. ఇలా హిందీకి వెళుతున్న తెలుగు దర్శకులు కొందరు ఉన్నారు. ఈ జాబితాలో హను రాఘవపూడి కూడా చేరుతున్నారని సమాచారం. ఆయన ఒక సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.
తెలుగులో 'అందాల రాక్షసి', 'కృష్ణగాడి వీరప్రేమగాధ', 'లై', 'పడిపడి లేచె మనసు' సినిమాలకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. జయాపజయాలను పక్కనపెడితే ఆయన మేకింగ్ అంటే ఇష్టపడే ప్రేక్షకులు, పరిశ్రమ ప్రముఖులు ఉన్నారు. హిందీ నుండి నిర్మాత అంజు శర్మకు హను రాఘవపూడి స్టైల్ నచ్చి, ఒక సినిమా చేయమని అడిగారట. ఎమోషనల్ యాక్షన్ డ్రామా ఐడియా ఒకటి చెప్పగా నచ్చడంతో సినిమా ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అన్నారట. ఇందులో సన్నీ డియోల్ హీరోగా నటిస్తారని సమాచారం. ఆల్రెడీ ఆయనకు 40 మినిట్స్ కథను హను రాఘవపూడి చెప్పారట. తెలుగులో దుల్కర్ సల్మాన్ హీరోగా స్వప్న సినిమా ప్రొడక్షన్ హౌస్ సినిమా చేశాక, హిందీ సినిమా చేస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



