సునీల్ డబ్బా కొట్టుకొంటున్నాడబ్బా..!
on Aug 11, 2016
హీరోగా మారాక... సునీల్ కి ఎన్ని హిట్లొచ్చాయో... అన్నింటికంటే ఎక్కువ ఫ్లాపులొచ్చాయి. సునీల్ హీరో ఎందుకయ్యాడో పాపం.. అంటూ జాలి చూపించే రోజులు మొదలయ్యాయి. వరుస ఫ్లాపులతో అల్లాడిపోతున్న సునీల్...`ఒక్క హిట్.. ఒకే ఒక్క హిట్ ` అంటూ కలవరిస్తున్నాడు. జక్కన్నతో హిట్టు కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సినిమా విడుదలై... మళ్లీ యధావిధిగా పల్టీ కొట్టింది. అయితే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ.. సినిమా రికవర్ అయ్యేంత కాదు. అయితేచిత్రబృందం మాత్రం.. మా వసూళ్లు ఇప్పటికీ అదిరిపోతున్నాయి.. అని డబ్బా కొట్టుకోవడం మొదలెట్టింది. 12 రోజులకే 15 కోట్లకు పైగా వసూలు చేసినట్టు బిల్డప్పులు ఇచ్చుకొంటోంది. సునీల్ కూడా నా కెరీర్లో ఇన్ని ఓపెనింగ్స్ చూడలేదు.. అంటూ బిల్డప్పులు ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాకి రూ.7 కోట్లకు మించి రాలేదని, ఈ లెక్కలన్నీ అంబక్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. జక్కన్న కంటే.. ముందు విడుదలైన పెళ్లి చూపులు సినిమాకి వసూళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయని చెబుతున్నారు. జక్కన్న ఇంకా బ్రేక్ ఈవెన్లోకి రాలేదని థియేటర్ యాజమాన్యాలు సైతం ఘోషిస్తున్నాయి. అయినా ఈ కాకి లెక్కలెందుకో మరి.