ENGLISH | TELUGU  

సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం మూవీ రివ్యూ

on Dec 7, 2018

 

 న‌టీన‌టులుః  సుమంత్‌, ఈషా రెబ్బ‌, సురేష్‌, సాయికుమార్‌, అలి, స‌త్య సాయి శ్రీనివాస్‌, మిర్చి మాధ‌వ్, జోష్ ర‌వి, భ‌ద్ర‌మ్‌, గిరిధ‌ర్‌, టియ‌న్ఆర్‌
 సాంకేతిక నిపుణులుః
 డిఓపిః ఆర్‌కే ప్ర‌తాప్‌
 ఎడిట‌ర్ః కార్తిక్ శ్రీనివాస్‌
 సంగీత ద‌ర్శ‌కుడుః శేఖ‌ర్  చంద్ర‌
 కొరియోగ్రాఫ‌ర్ః భాను
 ఫైట్స్ః డ్రాగ‌న్ ప్ర‌కాష్‌
 ప్రొడ్యూస‌ర్ః బీరం సుధాక‌ర్ రెడ్డి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: సంతోష్ జాగ‌ర్ల‌పూడి

 
 ఎవరికైనా కష్టం వస్తే భగవంతుడికి చెప్పుకుంటాం.. కానీ భగవంతుడే కష్టానికి కారణం అయితే ఎవరికి చెప్పుకుంటాం’అనే  బేసిక్ లైన్ తో రూపొందిన చిత్రం `సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం`. సుమంత్‌, ఈషా రెబ్బ జంట‌గా న‌టించిన ఈ చిత్రం ద్వారా సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ తో ఆక‌ట్టుకిని అంద‌రిలో సినిమా చూడాల‌న్న క్యూరియాసిటీని క్రియేట్ చేసింది.  డివోష‌నల్ థ్రిల్ల‌ర్  గా రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుద‌లైంది. మ‌రి ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం....

క‌థ‌లోకి వెళితే..

కొన్ని వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం అంత‌రిక్షం నుంచి ఒక గ్ర‌హ శ‌క‌లం భూమి మీద ప‌డుతుంది. ఆ గ్ర‌హ శ‌క‌లం సుబ్ర‌హ్మ‌ణ్యుడి ఆకారంలో ఉంటుంది. దీంతో అక్క‌డ ఒక గుడిని క‌ట్టిస్తాడు ర‌వివ‌ర్మ అనే రాజు. దాంతో ఆ గుడి చుట్టూ ఊరు ఏర్ప‌డుతుంది. అప్ప‌టి నుంచి ఆ ఊరు సుబ్ర‌హ్మ‌ణ్య పురంగా మారుతుంది. ఇలాంటి క్ర‌మంలో ఉన్న‌ట్టుండి సుబ్ర‌హ్మ‌ణ్యఫురంలో ఒక వ్య‌క్తి  సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఆల‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు.  అలా వ‌రుస‌గా ఆత్మ హ‌త్య‌లు  జ‌రుగుతూ ఉంటాయి. ఇలా వ‌రుస‌గా ప‌దిహేను హ‌త్య‌ల‌కు పైగా జ‌రుగుతాయి. దీంతో సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి ఆగ్ర‌హించాడ‌ని ...అందుకే ఇలా వ‌రుస‌గా ఆత్మ హ‌త్య‌లు జ‌రుగుతున్నాయని ఊళ్లో వారు అనుకుంటుంటారు. కానీ అస‌లు అక్క‌డ ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో ప్రాచీన టెంపుల్స్ పై రీసెర్చ్ చేసే హీరో సుమంత్ ఆ ఊరు హీరోయిన్ ద్వారా వెళ‌తాడు. అక్క‌డ త‌న ఫ్రెండ్ చ‌నిపోవ‌డంతో అస‌లు ఆ ఊళ్లో ఏం జ‌రుగుతుంది? ఏంటి? అని దాన్ని చేధించ‌డ‌మే సినిమా క్లైమాక్స్.
 
విశ్లేషణ:

ప్ల‌స్ పాయింట్స్
 సుమంత్ న‌ట‌న‌
 ఫ‌ర్వాలేద‌ని పించే సినిమాటోగ్ర‌ఫీ, నేప‌థ్య సంగీతం
 స్టోరీ లైన్‌
ఫ‌స్టాప్

 మైన‌స్ పాయింట్స్
 సెకండాఫ్‌
 స్టో నేరేష‌న్‌
 స‌న్నివేశాల్లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డం
 కార్తికేయ ఫ్లేవ‌ర్ ఎక్కువ‌గా ఉండ‌టం

న‌టీన‌టుల హావ‌భావాలుః
 దేవుడంటే న‌మ్మ‌కం లేని వ్య‌క్తిగా ... ప్రాచీన టెంపుల్స్ మీద రీసెర్చ్ చేసే పాత్ర‌లో సుమంత్ డీసెంట్ గా  న టించాడు. దేవుడు మీద విప‌రీత‌మైన భ‌క్తి క‌న‌బ‌రిచే పాత్ర‌లో ఈషా రెబ్బ ఓకే అనేలా త‌న పాత్ర‌ను పోషించింది. ఇక త‌న ఫ్రెండ్స్ గా జోష్ ర‌వి, భ్రద్ర‌మ్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక సాయి కుమార్,సీనియ‌ర్ న‌టుడు సురేష్ పాత్ర‌లు ఎప్ప‌టిలాగే వారి పాత్ర‌ల‌కు జ‌స్టిఫై చేశారు.

సాంకేతిక నిపుణులు ప‌నితీరుః
థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు సినిమాటోగ్ర‌ఫీ చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో  కూడా ఆర్ కే ప్ర‌తాప్ స్టోరీ మూడ్  త‌గ్గ‌ట్టుగా సినిమాటోగ్ర‌ఫీ అందించారు. పాట‌లు పెద్ద‌గా లేన‌ప్ప‌టికీ నేప‌థ్య సంగీతం శేఖ‌ర్  చంద్ర త‌న శైలిలో ఎప్ప‌టిలాగే సినిమాను ఎలివేట్ చేసే విధంగా అందించాడు. ఇక డైర‌క్ట‌ర్ క‌థ ను ఆస‌క్తిక‌రంగానే రాసుకున్నా కానీ, దాన్ని ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌నే చెప్పాలి. ఒక  చిన్న పాయింట్ తీసుకుని దాన్ని క్లైమాక్స్ వ‌ర‌కు లాగ‌డంతో బోర్ ఫీలింగ్ క‌లుగుతుంది.  అస‌లు సుబ్ర‌హ్మ‌ణ్య పురంలో ఏం జ‌రుగుతుంది? అని ఆస‌క్తి క‌రంగా ప్రారంభ‌మైన సినిమా వ‌రుస ఆత్మ‌హ‌త్య‌ల‌తో ఇంట్ర‌స్ట్  క్రియేట్ చేయ‌డంతో ఫ‌స్ట్ హాఫ్ వ‌ర‌కు ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. ఇక ఎప్పుడైతే హీరో సుబ్ర‌హ్మ‌ణ్య పురంలో అస‌లు ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌నే చేసే ప్ర‌య‌త్నం ముందుకెళ్ల‌కుండా అక్క‌డ‌క్క‌డే తిరుగుతూ ప్రేక్ష‌కుల‌ను అస‌హ‌నానికి గురి చేస్తుంది.  ఇక సుమంత్, ఈషాల‌కు మ‌ధ్య వ‌చ్చే ల‌వ్ స్టోరీ కూడా అంతగా ఆక‌ట్టుకోదు.

సూటిగా చెప్పాలంటేః
సుమంత్ ని ఈ క్యార‌క్ట‌ర్ కి సెల‌క్ట్  చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. మ‌ళ్లీరావా చిత్రంతో మెప్పించిన  సుమంత్ మ‌రోసారి  త‌న కిచ్చిన పాత్ర‌కు వంద‌కు వంద శాతం న్యాయం చేశాడు.  మంచి క‌థ‌, క‌థ‌నాల‌ను ఎన్నుకున్న‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు సినిమాను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే రీతిలో మ‌ల‌చ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. అందులో గ‌తంలో వ‌చ్చి స‌క్సెస్ ఫుల్ చిత్రంగా నిలిచిన `కార్తికేయ‌` చిత్రం షేడ్స్ కూడా `సుబ్ర‌హ్మ‌ణ్య పురం`లో ఎక్కువ‌గా ఉన్నాయి.    మ‌రి ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ గా ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి.

 రేటింగ్ః 2.25/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.