ENGLISH | TELUGU  

నెక్స్ట్ ఏంటి మూవీ రివ్యూ

on Dec 8, 2018

 


న‌టీ న‌టులు: సందీప్ కిష‌న్, త‌మ‌న్నా, న‌వ‌దీప్, పూన‌మ్ కౌర్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: కునాల్ కోహ్లీ
నిర్మాత: గౌరీ కృష్ణ‌
సంగీతం: లియాన్ జోన్స్
సినిమాటోగ్రఫర్‌: మ‌నీష్ చంద్ర భట్
ఎడిటర్: అనిల్ కుమార్ బొంతుసి
విడుద‌ల తేది: 7-12-2018

సందీప్ కిష‌న్, త‌మ‌న్నా,న‌వ‌దీప్ ముఖ్య పాత్ర‌ల్లో  బాలీవుడ్ డైరెక్ట‌ర్ కునాల్ కోహ్లీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం `నెక్స్ట్ ఏంటి`.   ఈ చిత్రం ఈ రోజే విడుద‌ల అయింది. మ‌రి ప్రేక్ష‌కులును ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం...  

స్టోరీలోకి వెళితే...

టామీ (త‌మ‌న్నా) సెక్స్ కి అతీత‌మైన వ్య‌క్తి.  నిజ‌మైన ప్రేమను కోరుకునే ర‌కం.  ఈ క్ర‌మంలో త‌న బాయ్ ఫ్రెండ్స్ తో సెట్ అవ్వ‌క బ్రేక‌ప్ చెబుతూ ఉంటుంది. అలాంటి టామీ లైఫ్ లోకి అనుకోకుండా సంజూ (సందీప్ కిష‌న్) వ‌స్తాడు. ఫ‌స్ట్ మీట్ లోనే ఇద్ద‌రికీ ఒక‌రి పై ఒక‌రికి ఇంట్ర‌స్ట్ క‌లుగుతుంది. దాంతో ఇద్ద‌రూ ఆరు నెల‌లు క‌లిసి ఒకే ఇంట్లో ఉంటారు. కానీ వారి  మ‌ధ్య ఎలాంటి ఫిజిక‌ల్ రిలేష‌న్ ఉండ‌దు. ఈ విష‌యంపై అస‌హ‌నానికి గురైనా సంజూ (సందీప్ కిష‌న్) టామీతో ఆర్గ్యూ చేస్తాడు. ఆ ఆర్గ్యూమెంట్ కార‌ణంగా ఇద్ద‌రూ విడిపోతారు. ఆ తరువాత జరిగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య టామీ లైఫ్ లోకి క్రిష్ (నవదీప్) వస్తే. సంజూ లైఫ్ లోకి వేరే అమ్మాయి వస్తోంది. మరి చివరికి ఎవరెవరు కలుస్తారు ? టామీ, సంజు కలుస్తారా ? కలిస్తే టామీ కోరుకున్న ప్రేమ సంజూ నుండి దొరుకుతుందా ? లేదా ? అన్న‌ది తెలియాలంటే సినిమా చూడాల్సిందే....

న‌టీన‌టుల హావ‌భావాలుః

త‌మ‌న్నా త‌న స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్లామ‌ర్ తోనూ ఆక‌ట్టుకుంటూ సినిమాకే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అయితే సెక్స్ కి అతీత‌మైన నిజ‌మైన ప్రేమ‌ను కోరుకున్నే అమ్మాయిగా. అలాగే ప్రేమ గురించి ఆమె పాయింటాఫ్ వ్యూలో చెప్పిన కొన్ని డైలాగ్ లు కూడా చాలా బాగున్నాయి. ఇక హీరోగా నటించిన సందీప్ కిషన్ గత తన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఫ్రెష్ గా, స్టైలిష్ గా కనిపించాడు. తన క్యారెక్టరైజేషన్ తో తన టైమింగ్‌ తో అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేస్తూనే, ఇటు సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటాడు.  త‌మ‌న్నా తండ్రి పాత్ర‌లో న‌టించిన సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఎప్ప‌టిలాగే త‌న న‌ట‌న‌తో మెప్పిస్తారు. త‌మ‌న్నాకు ఆయ‌న‌కు మ‌ధ్య సాగిన స‌న్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలుస్తాయి. ఇక న‌వ‌దీప్, పూన‌మ్ కౌర్ తో స‌హా మిగిలిన  న‌టీన‌టులు కూడా త‌మ పాత్ర  ప‌రిధి మేర‌కు బాగా న‌టించారు.

 సాంకేతిక నిపుణుల ప‌నితీరుః

`ఫనా`, `హమ్ తుమ్` లాంటి సూపర్ హిట్ చిత్రాల్ని హిందీలో తెరకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ, సినిమాలో మంచి థీమ్ తో పాటు మంచి క్యారెక్టరైజేషన్స్ రాసుకున్నారు. సినిమా మొత్తం లండన్ నేపథ్యంలో సాగడంతో అక్కడి విజువల్స్ కూడా ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఈ చిత్ర ద‌ర్శ‌కుడు కునాల్ కోహ్లీ మంచి క‌థాంశాన్ని ఎంచుకున్నాడు. అలాగే త‌న ద‌ర్శ‌క‌త్వ ప‌నిత‌నంతో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొన్నే ప్ర‌య‌త్నం అయితే చేశాడు గాని అది పూర్తి  సంతృప్తిక‌రంగా సాగ‌లేదు. ఆయ‌న సెకెడాంఫ్ పై ఇంకా శ్ర‌ద్ద పెట్టి ఉండి ఉంటే సినిమా కొంత‌వ‌ర‌కు ఓకే అనిపించేది.  మ‌నీస్ చంద్ర భ‌ట్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. సినిమాలో చాలా స‌న్నివేశాల‌ను ఆయ‌న మంచి విజువ‌ల్స్ తో చాలా అందం గా చూపించారు.   నిర్మాత ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

 విశ్లేష‌ణ‌లోకి వెళితేః

  ఫ‌స్ట్ హాఫ్ ఎంట‌ర్ టైన‌ర్ గా , అక్క‌డ‌క్క‌డ ఎమోష‌న‌ల్ గా సాగుతూ ఓకే అనిపించేలా ఉంది. సెకాండాఫ్ మాత్రం గాడీ త‌ప్ప‌డ‌మే కాకుండా  అస‌హ‌నానికి గురి చేసే  స‌న్నివేశాల‌తో ఏ మాత్రం ఆస‌క్తి క‌లిగించలేని క‌థ‌నంతో బోర్ కొట్టిస్తోంది.
దర్శకుడు సినిమాలో చెప్పాలనుకున్న దాన్ని విజువ‌ల్స్ తో కాకుండా  ప్రతిదీ డైలాగ్ ల రూపంలో చెప్పడం ప్రేక్షకుల స‌హ‌నానికి ప‌రీక్ష‌లా అనిపిస్తుంది.  పైగా త‌మ‌న్నా క్యారెక్ట‌రైజైష‌న్ మొద‌ట్లో ఇంట్ర‌స్ట్ గా అనిపించిన‌ప్ప‌టికీ చివ‌రికి వ‌చ్చే స‌రికి ఆ క్యారెక్ట‌రైజేష‌న్ కి క్లారిటీ మిస్ అయి విసుగు పుట్టిస్తోంది. చాలా చోట్ల సినిమాటిక్ ఎక్కువై స‌హ‌జ‌త్వం లోపించి ఓవ‌ర్ డ్రామా అనిపిస్తుంది.  ఓవ‌రాల్ గా బ‌ల‌హీనంగా సాగే  క‌థ‌నంలో బ‌ల‌మైన కాన్‌ఫ్లిక్ట్ మిస్ అయింది.

ఫైన‌ల్ గా చెప్పాలంటేః

ద‌ర్శ‌కుడు మంచి స్టోరీ లైన్ తీసుకున్న‌ప్ప‌టికీ , ఆ స్టోరీ లైన్ కి త‌గ్గ‌ట్టు సినిమాని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌లేక‌పోయారు. దీనికి తోడు సెకెడాంఫ్ క‌థ‌నం కూడా నెమ్మ‌దిగా సాగుతూ  బాగా బోర్ కొట్టిస్తోంది. మొత్తానికి త‌మ‌న్నా, సందీప్ కిష‌న్ ల‌ న‌ట‌న ఆక‌ట్టుకున్నా, సినిమా ఆకట్టుకోదు.అయితే సినిమాలో త‌మ‌న్నా శ‌ర‌త్ బాబుకు మ‌ధ్య‌న సాగిన స‌న్నివేశాలు సినిమాకే  ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల‌ను ఆదిరిస్తోన్న ఈ త‌రుణంలో ఈ సినిమాను ఏ మేర‌కు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారో  చూడాలి.

రేటింగ్ః 2.5/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.