నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి!
on Oct 29, 2018
శంకర్ దర్శకత్వం వహించిన 'బాయ్స్' సినిమాలో 'నాకొక గాళ్‌ఫ్రెండ్ కావాలి... నాకొక గాళ్‌ఫ్రెండ్ కావాలి' సాంగ్ గుర్తుందా? అప్పట్లో అబ్బాయిలందరూ పాడుకున్న పాట ఇది! దేవుడు ముందు వేడుకున్నారు కూడా... 'నాకొక గాళ్‌ఫ్రెండ్ ఇవ్వు స్వామి' అని! బహుశా... అమ్మాయిలు కూడా 'నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి' అని పాడుకుని వుంటారు. కానీ, ఎవరూ పాటగా రాయలేదు... 'నాకొక బాయ్‌ఫ్రెండ్ కావాలి' అని! ఒకవేళ రాసి వుంటే శ్రీరెడ్డి ఆ పాట పాడుకుంటూ వుండేవారేమో! ఇప్పుడు ఆమె ఓ తోడు కోసం ఎదురు చూస్తున్నారు. "చక్కటి అబ్బాయిని ఫ్రెండ్‌గా ఇవ్వమని దేవుణ్ణి సీరియస్‌గా కోరుకున్నా" అని శ్రీరెడ్డి ట్వీట్ చేశారు. "నా గతాన్ని పట్టించుకోకుండా నా బాధ్యతను తీసుకునేవాడు, నాకు టైమ్ ఇచ్చేవాడు కావాలి" అని అందులో పేర్కొన్నారు. చివరగా "ఓన్లీ చెన్నై బాయ్" అని హ్యాష్ ట్యాగ్ యాడ్ చేశారు. ఆమెకు చెన్నై చిన్నోడు మాత్రమే కావాలట! 'లక్ష్యం' సినిమాలో 'ఎవడు? ఎవడు? నాకు కాబోయేది ఎవడు?' అని కోరుకున్న క్వాలిటీస్ వున్న బాయ్‌ఫ్రెండ్ వచ్చేవరకూ పాడుకుంటూ వుంటారేమో!