అందంపై దృష్టి పెట్టిన కుర్ర భామ
on Jul 17, 2013
"బస్ స్టాప్", "మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు" వంటి చిత్రాలతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది శ్రీదివ్య. ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూసిన ఈ అమ్మడికి ఇపుడు వరుస అవకాశాలు వస్తున్నాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించే అవకాశం వచ్చింది. తమిళ భాషలో తెరకెక్కుతున్న "వరుత పడతా వాలిబార్ సంగం" అనే చిత్రంలో హీరో కార్తికేయ సరసన హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలిసింది. ఇలా వరుస అవకాశాలు వస్తుండటంతో ఈ అమ్మడు తన అందంపై దృష్టి పెట్టింది. మరి ఈ అమ్మడు తన కెరీర్ ను ఎలా మార్చుకుంటుందో చూడాలి.