రష్మిక కి శ్రీలీల ద్వారా గట్టి పంచ్ ఇచ్చిన నితిన్
on Nov 29, 2023
నితిన్ ప్రస్తుతం ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయ్యి నితిన్ ఫాన్స్ కి మూవీ లవర్స్ కి మంచి కిక్ ని ఇచ్చింది. అలాగే మూవీ పక్కా హిట్ అనే సంకేతాలని కూడా ఇచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి నితిన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెంకీ కుడుములతో చెయ్యబోయే తన నెక్స్ట్ మూవీ గురించి ప్రస్తావనకు వచ్చింది. ఆ మూవీ హీరోయిన్ విషయంలో నితిన్ చేసిన కొన్ని కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
నితిన్ హీరోగా చలో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక నూతన చిత్రం తెరకెక్కబోతుంది. ఈ మూవీలో మొదట రష్మిక ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కాల్షీట్ల సమస్య వాళ్ళ ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆ ప్లేస్ లో శ్రీలీల నితిన్ తో జతకట్టబోతుంది.ఈ హీరోయిన్ల మార్పు విషయంపై నితిన్ స్పందిస్తు ప్రస్తుతం చాలా మంది నటీమణులు బాలీవుడ్ లో భాగమయ్యే సినిమాల విషయంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాగే తెలుగులో హీరోయిన్ల కొరత చాలా ఉందని అలాంటిది శ్రీ లీల మన తెలుగు అమ్మాయి కావడం మనందరి అదృష్టం కూడా అని నితిన్ అన్నాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు విన్నవాళ్ళందరూ రష్మిక కి ఇన్ డైరెక్ట్ గా నితిన్ భలే పంచ్ ఇచ్చాడని అంటున్నారు.
అలాగే శ్రీలీల తో కలిసి మళ్ళీ వెంటనే వర్క్ చేయడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని ఈ సినిమాలో తన క్యారక్టర్ ని వెంకీ చాలా బాగా డిజైన్ చేసాడని ఖచ్చితంగా భీష్మ కంటే పది రేట్లు ఎక్కువగా మా సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని నితిన్ చెప్పాడు. కాగా నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ డిసెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది.ఈ సినిమాలో శ్రీలీలే హీరోయిన్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
