నారా రోహిత్ క్లాప్ తో ప్రారంభమైన శ్రీవిష్ణు కొత్త సినిమా
on Sep 25, 2022

ఇటీవల 'అల్లూరి' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన శ్రీవిష్ణు తాజాగా మరో సినిమాని ప్రారంభించాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'వివాహ భోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకుడు. తాజాగా ఈ మూవీ లాంచ్ అయింది.

'బ్రోచేవారెవరురా', 'రాజ రాజ చోర' వంటి సినిమాలలో తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్న శ్రీవిష్ణు ఈసారి పూర్తిస్థాయిలో నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు. 'వివాహ భోజనంబు'తో నవ్వులు పంచిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు.. శ్రీవిష్ణుతో కంప్లీట్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఈరోజు పూజాకార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నారా రోహిత్ క్లాప్ కొట్టగా, అనిల్ సుంకర కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఫస్ట్ షాట్ వీఐ ఆనంద్ డైరెక్ట్ చేశారు. గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



