దేవరకొండ ఇంట్లో విజయ్, అనన్య ప్రత్యేక పూజలు!
on Aug 17, 2022

విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కొద్దిరోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్న విజయ్, అనన్య తాజాగా పూజలో పాల్గొన్నారు. ఈ పూజ విజయ్ ఇంట్లో ఆయన తల్లి నిర్వహించడం విశేషం. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశాడు విజయ్.
"ఇప్పటికే దేశమంతా పర్యటించి దేవుని ఆశీర్వాదం లాంటి ప్రేమను పొందాం. కానీ అమ్మ మాకు దేవుని రక్షణ అవసరమని భావిస్తుంది. అందుకే పూజ నిర్వహించి, రక్ష తాయెత్తులు కట్టింది. ఇప్పుడు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది.. మేం మా టూర్ ని కొనసాగించవచ్చు" అంటూ ట్వీట్ చేసిన విజయ్ పూజకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నాడు. అందులో విజయ్, అనన్య పురోహితుల ఆశీర్వాదం తీసుకుంటూ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



