భారీ సినిమాలకు పోటీగా 'స్పార్క్ 1.O'!
on Aug 1, 2022

ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'స్పార్క్ 1.O'(ఒన్ పాయింట్ ఓ). హితేంద్ర నటించి నిర్మించిన 'స్పార్క్ 1.O' సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం ఆగస్టు ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆగస్టులో పలు క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 5న 'బింబిసార', 'సీతా రామం', ఆగస్టు 11న 'లాల్ సింగ్ చడ్డా', ఆగస్టు 12న 'మాచర్ల నియోజకవర్గం', 'కార్తికేయ-2', ఆగస్టు 25న 'లైగర్' సినిమాలు ఉన్నాయి. పోటీగా ఇన్ని సినిమాలున్నా 'స్పార్క్ 1.O'ని ఆగస్టులోనే విడుదల చేస్తుండటం విశేషం. కంటెంట్ మీద నమ్మకంతోనే భారీ పోటీ ఉన్నా విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా రూపొందిన 'స్పార్క్ 1.O' చిత్రంలో నటించడం తనకు చాలా సంతోషంగా ఉందని హీరోయిన్స్ లో ఒకరైన భవ్యశ్రీ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా గోపి (అమితాబ్), ఎడిటర్ గా అనిల్ కుమార్ వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



