సంజయ్ దత్ బర్త్‌డేకి బిగ్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తున్న 'కేజీఎఫ్ 2' టీమ్
on Jul 28, 2021
ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తున్న అత్యంత ఆసక్తికర ప్యాన్ ఇండియా సినిమాల్లో 'కేజీఎఫ్: చాఫ్టర్ 2' ఒకటి. 'కేజీఎఫ్' చాప్టర్ 1 విడుదలైనప్పుడు దేశవ్యాప్తంగా ఆ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ తయారయ్యారు. ఫస్ట్ మూవీతో పోలిస్తే సెకండ్ ఫిల్మ్ ఐదు రెట్లు భారీతనంతో, ఇంటెన్సిటీతో ఉంటుందని చెప్తున్నారు. యష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో విలన్ 'అధీర' పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా, మరో కీలక పాత్రను రవీనా టాండన్ చేస్తుండటం ఈ సినిమాపై క్యూరియాసిటీని రేకెత్తిస్తూ, సినీ ప్రియుల్లో అంచనాలను అమితంగా పెంచేసింది.
సంజయ్ దత్‌కు దక్షిణాదిన ఇదే తొలి సినిమా. 'బాబా'గా ఇండస్ట్రీలోని వాళ్లు ముద్దుగా పిలుచుకొనే సంజయ్ పుట్టినరోజు జూలై 29. ఇది ఆయనకు 62వ బర్త్‌డే. ఈ సందర్భంగా 'కేజీఎఫ్ 2' టీమ్ అభిమానుల కోసం స్పెషల్ సర్ప్రైజ్ను ప్లాన్ చేస్తోందని తెలిసింది. అది టీజర్ రూపంలో ఉంటుందా? లేక పోస్టర్ రూపంలో ఉంటుందా.. అనే విషయం వెల్లడి కాలేదు.
ఇదివరకే రిలీజ్ చేసిన 'అధీర' లుక్‌లో సంజయ్ దత్ అదరగొట్టారు. మూవీలో సంజయ్, యష్ మధ్య వచ్చే ఒక భారీ ఇంటెన్స్ ఫైట్ ఆడియెన్స్ ఒళ్లు జలదరింపజేస్తుందని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తవగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో జాప్యం జరుగుతూ వచ్చింది.
'కేజీఎఫ్ 1'కు సీక్వెల్‌గా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ఇదివరకు ఈ మూవీని అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ పాండమిక్ కారణంగా విడుదల వాయిదా వేశారు. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.