నన్ను 'తలా' అని పిలవవద్దు.. అజిత్ అని పిలిస్తే చాలు!
on Dec 1, 2021

ఆర్భాటాలు, హంగులు కోరుకోకుండా సింపుల్‌గా ఉండేందుకు ఇష్టపడే తమిళ్ సూపర్‌స్టార్ అజిత్ తనను ఇక నుంచి 'తలా' అనే పేరుతో పిలవవద్దని అభిమానులను, మీడియాను కోరుతూ ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తన పేరుకు ముందు ఎలాంటి సంబోధనలు వద్దని ఆయన చెప్పాడు.
"గౌరవనీయులైన మీడియా, పబ్లిక్, జెన్యూన్ ఫ్యాన్స్‌కు.. ఇక నుంచి నన్ను అజిత్ కుమార్, అజిత్ లేదీ ఏకే అని మాత్రమే పిలవాలని కోరుకుంటున్నాను. నా పేరుకు ముందు 'తలా' అని కానీ, మరే ఇతర సంబోధనలు కానీ చేర్చవద్దు. మీ అందరికీ మంచి ఆరోగ్యం, ఆనందం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన తెలిపాడు. ఈ స్టేట్‌మెంట్‌ను అజిత్ ప్రతినిధి సురేశ్ చంద్ర తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు.
'దీన' (2001) సినిమాతో వచ్చిన క్రేజ్‌తో అభిమానులు ఆయనను 'తలా' అని సంబోధించడం ప్రారంభించారు. అందులోని ఓ పాటలో సపోర్టింగ్ ఆర్టిస్టులు అజిత్‌ను 'తలా' అని పిలుస్తారు. దానర్థం నాయకుడు, అధినాయకుడు అని. అప్పట్నుంచీ తమిళ సినిమాలో అజిత్, 'తలా' అనే పేర్లు పర్యాయ పదాలుగా మారాయి.
స్క్రీన్ మీద లార్జర్ దేన్ లైఫ్ పర్సన్‌గా కనిపించే అజిత్ ఎప్పుడూ కూడా తనను తాను ఒక సాధారణ వ్యక్తిగానే భావించుకుంటూ, బయటకూడా అలాగే ఉండేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నాడు. తన ఫ్యాన్ క్లబ్స్‌ను రద్దు చేసిన వన్ అండ్ వోన్లీ స్టార్ అజిత్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'వలిమై' జనవరిలో పొంగల్ కానుకగా విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



