‘అక్కా! శ్రీహాన్ నీకెందుకు?.. నాకు ఇచ్చేయ్’.. నెటిజన్ కామెంట్‌కు షాకైన సిరి!
on Oct 15, 2022
.webp)
సోషల్ మీడియా ఒక్కోసారి నవ్విస్తుంది.. ఒక్కోసారి బాధపడేలా చేస్తుంది. అందులోనూ ఇన్స్టాగ్రామ్ వచ్చాక, 'ఆస్క్ మీ ఆ క్వశ్చన్' అని, 'టెల్ మీ యువర్ సీక్రెట్స్' అని ఇలా డిఫరెంట్ టాస్క్స్ అనేవి డిజైన్ చేయబడ్డాయి. ఇక సెలబ్రిటీస్ కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఐతే ఇందులో నెటిజన్స్ అడిగే ప్రశ్నలు చూస్తే కొన్ని సార్లు నవ్వొస్తుంది కూడా.
ఇప్పుడు సిరి హన్మంత్ కి కూడా అలాంటి ఒక ప్రశ్న ఒక నెటిజన్ నుంచి ఎదురయ్యింది. దాంతో ఆమె నోరెళ్లబెట్టక తప్పలేదు. "ఆస్క్ మీ ఆ క్వశ్చన్" అనే టాస్క్ ఇచ్చిన సిరికి "అక్కా! శ్రీహాన్ నీకు ఎందుకు.. నాకు ఇచ్చేయొచ్చుగా.. చాలా క్యూట్ గా ఉన్నాడు" అనేసరికి షాకయ్యింది సిరి.
అలాగే ఇంకో నెటిజన్ "శ్రీహన్ నీకు కొన్న మొదటి గిఫ్ట్ ఏంటి" అని అడిగేసరికి "చెవి దిద్దులు" అని ఆన్సర్ ఇచ్చింది సిరి. ఇంకో నెటిజన్ ఐతే ప్రాస కవిత్వం చెప్పేసాడు. "మా పప్పులో ఉంది ఉప్పు.. మా శ్రీహాన్ అన్నదే కప్పు" అనేసరికి సిరి ఆనందం మాములుగా లేదు.
ఐతే శ్రీహాన్ మీద బయట చాలామందికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టాప్ 5లో ఉంటాడని ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంటెస్టెంట్స్ అందరి మీద నెగటివ్ టాక్ వస్తోంది కానీ శ్రీహాన్ మీద మాత్రం అలాంటి టాక్ చాలా తక్కువనే చెప్పొచ్చు. మరి చూడాలి.. ఈసారి రేవంత్, శ్రీహాన్ వీళ్లల్లో బిగ్ బాస్ కప్ ఎవరిదీ అని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



