హీరోయిన్స్ స్నేహితులు కాలేరు.. అసలు నిజం ఏంటి!
on Apr 26, 2025
చిరంజీవి,(Chiranjeevi)బాలకృష్ణ(Balakrishna)నాగార్జున(Nagarjuna)వెంకటేష్(Venkatesh)వంటి అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోగా తన సత్తా చాటిన భామ సిమ్రాన్(Simran). గ్లామర్,పెర్ఫార్మెన్స్ ,డాన్స్ ల పరంగా ఆ నలుగురు హీరోలతో పోటీపడి మరి నటించిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో వివిధ క్యారెక్టర్స్ లో నటిస్తు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది. రీసెంట్ గా అజిత్(Ajith)హిట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly)లో ప్రాముఖ్యత గల పాత్రలో కనపడి మెప్పించింది. ఇటీవల జరిగిన ఒక అవార్డు కార్యక్రమంలో సిమ్రాన్ మాట్లాడుతు ఒక సినిమాలో కీలక పాత్ర పోషించిన నటికి బాగా నటించావని చెప్పి మెసేజ్ చేశాను. దాంతో ఆమె నాకు రిప్లైగా ఆంటీ రోల్స్ లో నటించడం కంటే ఆ క్యారక్టర్ ఎంతో ఉత్తమం అని మెసేజ్ చేసింది. సినిమాల్లో పనికి మాలిన డబ్బా రోల్స్ లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ రోల్స్ లో నటించడం ఎంతో బెటర్ అని సిమ్రాన్ మాట్లాడింది.
ఇప్పడు ఆ మాటలపై సిమ్రాన్ మరోసారి వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతు నా తోటి నటి ప్రవర్తనతో ఎంతో బాధపడ్డాను. అందుకే అవార్డు ఫంక్షన్ లో నాకనిపించింది చెప్పాను. నేను కూడా ఆంటీ రోల్స్ చేశాను. అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ స్నేహితులనుకున్న వాళ్ళు తమ కామెంట్స్ తో మనల్ని ఎంతగానో బాధిస్తారు. నాకు ఎదురైన ఈ అనుభవంతో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎప్పటికి స్నేహితులు కాలేరని మరోసారి నిజమయ్యింది. . అవార్డుల కార్యక్రమం తర్వాత ఆ నటి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. కానీ ఇంతకు ముందులా మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఇప్పుడు లేదని చెప్పుకొచ్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
