శభాష్ శింబు.. వరద బాధితులకు అండగా నిలిచిన తొలి తమిళ హీరో!
on Sep 10, 2024

ఇటీవల భారీ వర్షాలకు, వరదలకు తెలుగు రాష్ట్రాలలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరద బాధితులకు అండగా తెలుగు సినీ పరిశ్రమ ముందుకు వచ్చింది. స్టార్స్ నుండి సాధారణ ఆర్టిస్ట్ ల వరకు వారికి తోచిన సాయన చేసి.. కష్ట సమయంలో ప్రజలకు, ప్రభుత్వాలకు అండగా నిలిచారు. అయితే తెలుగు స్టార్స్ ఇతర రాష్ట్రాలలో ఏవైనా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా వారికి తోచిన సాయం చేస్తుంటారు. కానీ తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఇతర భాషలకు చెందిన స్టార్స్ నుంచి ఆ మద్దతు కరువైంది. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కోట్ల కలెక్షన్లను కొల్లగొడుతుంటారు కానీ కష్ట సమయంలో అండగా ఉండట్లేదని సినీ అభిమానాలు సైతం నిరాశచెందారు. అయితే మిగతా వారికి స్ఫూర్తి నింపుతూ తమిళ హీరో శింబు (Simbu) తొలి అడుగు వేశాడు.
గతంలో పలుసార్లు తన మంచితనాన్ని సహృదయతను చాటుకున్న తమిళ హీరో శింబు.. మరోసారి తన ఉదారతను చాటాడు. వరద బాధితుల కోసం హీరో శింబు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి తన వంతు సహాయంగా ఆరు లక్షల విరాళం ప్రకటించాడు. వరదల వల్ల త్రీవంగా నష్టం పోవడం తనకు ఎంతో బాధను కలిగిస్తుందని, అందరూ త్వరగా ఈ విపత్తు నుండి బయటపడాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నానని శింబు తెలిపాడు.
తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శింబుని ప్రశంసిస్తున్నారు. శింబు బాటలోనే ఇతర హీరోలు కూడా పయనిస్తే బాగుంటుందని కోరుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



