ఫిష్ వెంకట్ ని అపోలో లో చేర్పించిన చిరంజీవి
on Sep 10, 2024

తెలుగు సినిమా రంగంలో నాలుగు దశాబ్దాలపై నుంచి నెంబర్ వన్ హీరోగా ఉండటమే కాకుండా సేవా రంగంలోను నెంబర్ వన్ అనిపించుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటుగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కూడా కాపాడిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా మరో సంఘటనతో తలచుకోగానే ప్రత్యక్షమయ్యే ఆపద్బాంధవుడు అని నిరూపించుకున్నాడు.
ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్(fish venkat)కి డయాలసిస్ వల్ల రెండు కిడ్నీలు చెడిపోయిన విషయం ఇటీవలే బయటకి వచ్చింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి, ఫిష్ వెంకట్ కి ఫోన్ చేసి విషయం మొత్తం తెలుసుకున్నాడు.ఇక వెంటనే అపోలో హాస్పిటల్స్ లో జాయిన్ చేయించి ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నాడు.ఖర్చులు మొత్తం చిరునే భరిస్తున్నాడు. అంతే కాకుండా ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు వాకబు కూడా చేస్తున్నాడు.
ఇక ఫిష్ వెంకట్ మెగా కాంపౌండ్ లో ఖుషి, బన్నీ, గబ్బర్ సింగ్,నాయక్,రచ్చ, తిక్క, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి పలు సినిమాల్లో చేసాడు.స్వతహాగా చిరంజీవి అభిమాని అయిన ఫిష్ వెంకట్ చిరు తో కలిసి ఖైదీ నెంబర్ 150 లో చేసాడు. ఫిష్ వెంకట్ ఇల్లు మొత్తం చిరంజీవి ఫొటోలే ఉంటాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



