'శ్యామ్ సింగరాయ్'తో నాని ప్రభంజనం.. శాటిలైట్ రైట్స్ కి అన్ని కోట్లా!
on Dec 11, 2021

నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమా డిసెంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాని గత చిత్రాలు 'వి', 'టక్ జగదీష్' ఓటీటీలో విడుదలై నిరాశపరిచినప్పటికీ రికార్డు స్థాయిలో 'శ్యామ్ సింగరాయ్' ప్రీరిలీజ్ బిజినెస్ జరుగుతోంది.
Also Read: వరంగల్ లో 'శ్యామ్ సింగరాయ్' రాయల్ ఈవెంట్!
ఇప్పటికే 'శ్యామ్ సింగరాయ్' హిందీ డబ్బింగ్ రైట్స్ ని ఓ ప్రముఖ సంస్థ రూ.10 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా మంచి అమౌంట్ కి అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ టీవీ ఛానల్ 'శ్యామ్ సింగరాయ్' తెలుగు శాటిలైట్ రైట్స్ ను రూ.10 కోట్లకు దక్కించుకుంది. నాని సినిమాకి శాటిలైట్ రైట్స్ రూపంలో రూ.10 కోట్లు రావడం మంచి డీల్ అనే చెప్పొచ్చు.
Also Read: తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!
నాని 'శ్యామ్ సింగరాయ్'పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత రెండు చిత్రాలతో నిరాశపరిచిన నాని.. 'శ్యామ్ సింగరాయ్'తో ఎలాగైనా హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు. డిసెంబర్ 24 న విడుదల కావాల్సిన 'గని' కూడా పోటీ నుంచి తప్పుకోవడంతో క్రిస్మస్ కి సోలోగా అలరించడానికి నానిని ఛాన్స్ దొరికింది. ఈ సినిమాతో నాని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.
Also Read: 'గని' విడుదల వాయిదా.. నానికి కలిసొచ్చింది!
నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



