తెలుగు రాష్ట్రాలలో ముందు రోజే 'ఆర్ఆర్ఆర్' ప్రీమియర్స్!
on Dec 11, 2021

'ఆర్ఆర్ఆర్' మూవీ నుంచి 'నాటు నాటు' సాంగ్ విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సాంగ్ లిరికల్ వీడియోలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్ ల వాళ్ళు ఈ స్టెప్ ని తమదైన శైలిలో వేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఓ వైపు ఈ సాంగ్ కి ఇంత రెస్పాన్స్ వస్తుంటే, మరోవైపు ఈ సాంగ్ పై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రధారుల చేత ఇలాంటి పాటలకు స్టెప్పులు వేయించడం ఏంటంటూ రాజమౌళిని పలువురు తప్పుబట్టారు.
Also Read: తారక్, చరణ్ వల్ల టైం వేస్ట్ అయింది!
తాజాగా హైదరాబాద్ లో జరిగిన 'ఆర్ఆర్ఆర్' ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ వివాదంపై రాజమౌళి స్పందించాడు. ఇది కంప్లీట్ ఫిక్షన్ మూవీ అని మరోసారి గుర్తుచేసిన ఆయన.. మూవీలో మొత్తం సాంగ్ చూశాక క్లారిటీ వస్తుందని అన్నాడు. నాటు నాటు సాంగ్ ని ఊరికే పెట్టలేదని, దానిలో కూడా ఎమోషన్ ఉంటుందని చెప్పాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఎమోషన్ ఎక్కువగా ఉంటుందని, ఎమోషన్స్ తో పిండేస్తామని రాజమౌళి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు.
Also read: అక్కడ నేనొకదాన్ని ఉన్నాననే ధ్యాసలేకుండా తారక్, చరణ్ తెగ కబుర్లు చెప్పుకునేవారు!
'ఆర్ఆర్ఆర్' జనవరి 7 న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే తెలుగు రాష్ట్రాలలో ముందురోజు ప్రీమియర్ షోలు వేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. జనవరి 6 న సెకండ్ షో నుంచి తెలుగు రాష్ట్రాలలో 'ఆర్ఆర్ఆర్' ప్రదర్శిస్తారని న్యూస్ వినిపిస్తోంది. ఈ ప్రచారంపై స్పందించిన రాజమౌళి ప్రస్తుతానికి అలాంటి ఆలోచన లేదన్నారు. ఒకవేళ ప్రొడ్యూసర్ దానయ్య గారు, డిస్ట్రిబ్యూటర్స్ ఓకే అంటే అప్పుడు ప్రీమియర్స్ వేస్తామని అన్నారు.
Also read: పాండెమిక్ కూడా విడదీయలేకపోయింది.. మాది ట్రూ ఫ్రెండ్ షిప్!
ఇక ఆంధ్రప్రదేశ్ లో టికెట్స్ ధరపై నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. ఇప్పుడున్న ధరలతో ఏ పెద్ద సినిమాకి వర్కౌట్ కాదని అన్నారు. ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



