వృద్ధురాలి పాత్రలో శృతిహాసన్
on Apr 23, 2014

కమల్ హాసన్ కూతురు అంటే ఇలాగే ఉండాలి అనే విధంగా తన తండ్రి పేరును మరింత పెంచేస్తున్న హీరోయిన్ శృతిహాసన్. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టవుతున్నాయి. ఒకప్పుడు ఐరెన్ లెగ్ అని పిలిచిన హీరో, దర్శక, నిర్మాతలే ఇపుడు గోల్డెన్ లెగ్ అంటూ తమ సినిమాల్లో నటించమని అడుగుతున్నారు. కానీ శృతి మాత్రం తన సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎప్పుడు గ్లామర్ పాత్రలే కాకుండా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటుంది.
ప్రస్తుతం శృతి "బిచ్డే సభి బారి బారి" అనే చిత్రంలో నటించనుంది. ఇందులో శృతి అందమైన యువతిగా మరియు ఓ వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. కమల్ వలె పలు విభిన్న పాత్రలను ఎంచుకుంటుంది. ఈ చిత్రంపై శృతి చాలా నమ్మకంతో ఉంది.అదే విధంగా శృతి ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా ఉంది. మరి ఈ చిత్రాలన్నీ ఘన విజయం సాధించి శృతిని టాప్ 1 స్థాయికి చేర్చాలని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



