బికినీ జీవితమే బాగుందట
on Dec 27, 2019
బికినీలో జీవితమే బాగుందని చెబుతోంది బెంగాలీ భామ శ్రద్ధా దాస్. సినిమాల్లో, ఐటమ్ సాంగుల్లో మాత్రమే కాదు... సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోతలో మిగతా హీరోయిన్ల కంటే ఓ అడుగు ముందుంటుంది. స్నేహితులతో కలిసి ఇయర్ ఎండ్ పార్టీకి ఇండోనేషియా వెళ్లిన శ్రద్ధా దాస్ ఏడెనిమిది రోజులుగా బికినీ ఫొటోలతో ఇంటర్నెట్లో సెగలు పుట్టిస్తోంది. ఈ రోజు అయితే బికినీ జీవితమే బాగుందని ఓ ఫొటోకి కాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం శ్రద్ధా దాస్ చేతిలో తెలుగు సినిమాలు ఏవీ లేవు. ఆమాటకు వస్తే చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. అవకాశాలు వచ్చినప్పుడు సినిమాలు చేస్తుంది. కానీ, అదృష్టమే కలిసి రావడం లేదు. అందువల్ల, వెబ్ సిరీస్ లు చేస్తుంది. అల్లు అర్జున్ 'ఆర్య 2', ప్రభాస్ 'డార్లింగ్', గోపీచంద్ 'మొగుడు' సినిమాల్లో హాట్ షో చేసినా ఆమెకు కలిసి రాలేదు. అయితే ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో ప్రేక్షకుల్లో తన క్రేజ్ నిలుపుకుంటోంది. 'పాట వచ్చి పదేళ్లు అయింది. అయినా పవర్ తగ్గలేదు' - 'గబ్బర్ సింగ్'లో అలీ చెప్పిన డైలాగ్. 'ఖుషి'లో 'ఏ మే రాజః ఏ మేరా ఘర్ మేరా ఆషియా' పాట గురించి, పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ! హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి కూడా ఇలాగే చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీదకు వచ్చి పదేళ్లు అయినా గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు.