త్రివిక్రమ్ క్లాప్ తో మొదలైన శర్వానంద్ కొత్త చిత్రం
on Sep 5, 2022

సెప్టెంబర్ 9న 'ఒకే ఒక జీవితం' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న శర్వానంద్ తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. ఈరోజు(సోమవారం) స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ తో ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది.
లిరిక్ రైటర్ గా ఎన్నో సాంగ్స్ రాసి ఆకట్టుకున్న కృష్ణ చైతన్య 2014లో వచ్చిన 'రౌడీ ఫెలో చిత్రంలో దర్శకుడిగా మెప్పించాడు. ఆ తర్వాత 'ఛల్ మోహన్ రంగ'(2018) డైరెక్ట్ చేసిన చైతన్య ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మెగాఫోన్ పట్టుకోబుతున్నాడు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిల్మ్ తాజాగా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.
దాదాపు ఐదేళ్లుగా శర్వానంద్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా ఆరు ప్లాప్ లు అందుకున్న ఈ టాలెంటెడ్ యాక్టర్ 'ఒకే ఒక జీవితం'పైనే ఆశలు పెట్టుకున్నాడు. మరి ఆ సినిమా సంగతి ఎలా ఉన్నా కృష్ణ చైతన్య అయినా శర్వాకి సాలిడ్ హిట్ ఇస్తాడేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



