మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సంతోష్ శోభన్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
on Sep 5, 2022

'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'(2013) సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మేర్లపాక గాంధీ మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 'ఎక్స్ ప్రెస్ రాజా', 'కృష్ణార్జున యుద్ధం', 'మాస్ట్రో' సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. డైరెక్టర్ గా తన ఐదవ చిత్రాన్ని యంగ్ హీరో సంతోష్ శోభన్ తో చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.
ఆముక్త క్రియేషన్స్ తో కలిసి నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'లైక్ షేర్ & సబ్ స్క్రైబ్' అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. తాజాగా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా, సుదర్శన్ ఫారెస్ట్ లో నిల్చొని పైకి చూస్తున్నట్లుగా ఉన్న పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ అడ్వెంచర్ ఫిల్మ్ లో మేర్లపాక గాంధీ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఉండనుందని తెలుస్తోంది.

గతేడాది సంతోష్ శోభన్ నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాకి మేర్లపాక గాంధీనే కథ అందించడం విశేషం. మరి ఇప్పుడు దర్శకుడిగా సంతోష్ కి ఎలాంటి చిత్రాన్ని అందిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



