చందు, పవిత్ర సంబంధంపై నరేష్ సంచలన కామెంట్స్...
on May 22, 2024

సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా తెలుగువన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరికి ఏదైనా అయితే, మిగతా వారంతా అండగా నిలిచే వారు. ఇప్పుడు అలాంటి కల్చర్ లేదు. ఈ తరం వారు ఎవరికి వారే అన్నట్టుగా ఉంటున్నారు. మా అమ్మ విజయనిర్మల గారు మరణించినప్పుడు.. నేను, కృష్ణ గారు ఎంతో కృంగిపోయాము. ఆ సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచాం. అలాగే కుటుంబ సభ్యులు కూడా అండగా నిలిచారు. అలా ఆ బాధ నుంచి చిన్నగా బయటకు వచ్చాము. ఒక వ్యక్తి బాధపడుతుంటే.. పది మంది మనకి ఉన్నారు అనే భావన అతనికి కలిగేలా చేయగలగాలి. అప్పుడే వారు ఆ బాధ నుంచి బయటకు వస్తారు. ఒకప్పుడు మానవ సంబంధాలు బాగుండేవి. ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లతో బిజీగా ఉంటూ పక్కన వాళ్ళతో కూడా మాట్లాడటం లేదు. ఈ పరిస్థితి మారాలి." అని నరేష్ అన్నారు.
పవిత్ర మరణం తర్వాత.. చందు తనకిక ఎవరు లేరని ఒంటరిగా ఫీల్ అయ్యాడని, అదే అతని ఆత్మహత్యకు కారణమైందనే అభిప్రాయాన్ని నరేష్ వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



