పవన్ కళ్యాణ్ కి రోజాకి పోలికే లేదు..హీరోయిన్ లయ సంచలన వ్యాఖ్యలు
on May 22, 2024

ఒక వైపు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్..ఇంకో వైపు ఒకప్పటి అందాల హీరోయిన్ లయ. వీళ్ళిద్దరకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా! సంబంధం ఉంది. లయ తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన మాటలు వైరల్ గా మారాయి. వైరల్ గా మారడమే కాదు పలు చర్చలకి కూడా దారి తీశాయి. ఇంతకీ ఏం మాట్లాడిందో చూద్దాం.
ప్రజలకి మంచి చెయ్యాలనే లక్ష్యంతో పవన్ రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన పొలిటికల్ స్పీచ్‌లు ఇష్టం. రెగ్యులర్ రాజకీయ నాయకులు మాట్లాడినట్లుగా కాకుండా ఫ్రెష్‌గా, కొత్తగా ఉంటాయి. రాజకీయ నాయకుడు అంటే ఇలా కూడా ఉంటారా అనిపించేలా వ్యక్తిత్వం ఉంటుంది. పవన్ ఆహ్వానిస్తే పార్టీలో చేరడానికి సిద్ధం అని కూడా చెప్పింది. అదే సందర్భంలో నన్నెందుకు పార్టీలోకి పిలుస్తారు అనే మాట కూడా చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక ఆ తర్వాతే ఆమె మాటలు వివాదాస్పదమయ్యాయి.హీరోయిన్‌గా రాణించిన రోజా రాజకీయాల్లోకి వెళ్లి పక్కా పొలిటీషియన్‌లా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి రోజా లయ మాటలపై ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం.రోజా నోరు తెరిస్తే ఈ విషయం చిలికి చిలికి గాలి వానలా మారడం ఖాయం. ఆమె ట్రాక్ రికార్డు ఆ పరిస్థితిని సూచిస్తుంది
.webp)
ఇక లయ అచ్చ తెలుగు అమ్మాయి. సొంత ఊరు విజయవాడ. 1992 లో వచ్చిన భద్రం కొడుకో ఆమె మొదటి సినిమా. స్వయం వరం, ప్రేమించు, మనోహరం,కొండవీటి సింహాసనం, హనుమాన్ జుంక్షన్, దేవుళ్ళు,మనసున్న మారాజు, మిస్సమ్మ, విజయేంద్రవర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా ఇలా సుమారు 35 చిత్రాలకి పైనే చేసింది. తమిళ, మలయాళ సినిమాల్లోను చేసింది. పెళ్లి తర్వాత నటనకి విరామం ఇచ్చి మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.లయ రాజకీయాలకి కొత్తేమి కాదు. గతంలో మూవీ మొఘల్ రామానాయుడు తో పాటు కొంత మంది సినీ ప్రముఖులు ఎలక్షన్స్ లో పోటీ చేసినప్పుడు ప్రచారం చేసింది .
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



