రజనీతో 27 ఏళ్ళ తరవాత?
on Dec 4, 2018

సంతోష్ శివన్... ఇండియన్ టాప్ సినిమాటోగ్రాఫర్లలో ఒకరు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో 27 ఏళ్ళ తరవాత ఈయన పని చేయబోతున్నారని చెన్నై టాక్. రజనీ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనికి సినిమాటోగ్రాఫర్‌గా సంతోష్ శివన్‌ని తీసుకున్నారట. మురుగదాస్ తీసిన 'తుపాకీ', 'స్పైడర్' సినిమాలకు సంతోష్ శివన్ పని చేశారు. ఆయన గతంలో రజనీకాంత్ సినిమాకూ పని చేశారు. అదే 27 ఏళ్ళ క్రితం విడుదలైన 'దళపతి'. ఆ తరవాత మరో రజనీ సినిమాకు పని చేయలేదు. మళ్ళీ ఇప్పటికి కుదిరింది. ఇటీవల విడుదలైన '2.ఓ' విజయంతో రజనీ సంతోషంగా వున్నారు. విజువల్ వండర్, సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ '2.ఓ'ను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థే మురుగదాస్ సినిమానూ నిర్మించనుంది. ప్రస్తుతం 'పిజ్జా' ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పేట' సినిమా చేస్తున్నారు రజనీకాంత్. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఆ తరవాత మురుగదాస్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



