వెండితెరపై మళ్లీ సందడి చేయనున్న రియల్ కపుల్!!
on May 18, 2021

నాగ చైతన్య-సమంత జంటకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది. 'ఏ మాయ చేసావే' సినిమాతో వెండితెరపై సందడి చేసిన ఈ జంట.. ఆ తరువాత ప్రేమలో పడి, పెళ్లి చేసుకొని రియల్ జంటగా మారిపోయారు. పెళ్లి తరువాత కూడా మజిలీ సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ జంట. తాజా సమాచారం ప్రకారం ఈ జంట మరోసారి వెండితెరపై మెరవనుందని తెలుస్తోంది.
నాగార్జున హీరోగా నటించిన 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్ కూడా నటించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బంగార్రాజులో నాగచైతన్యకు జోడిగా సమంత నటించనున్నట్లు తెలుస్తోంది. ముందుగా చిత్ర యూనిట్ ఇతర నటీమణులను పరిశీలనలలోకి తీసుకున్నా.. చివరిగా సమంత అయితేనే బెస్ట్ అనే నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో రియల్ లైఫ్ లో లాగానే రీల్ లైఫ్ లో కూడా నాగార్జున, సమంత మామ కోడలుగా కనిపించనున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



