మహేశ్ బ్యూటీపై భాయ్ కన్ను!
on Jun 22, 2015

భాయ్ చేయి తగిలితే బండపిల్ల బక్కగామారుతుంది. విషయం లేని అమ్మాయి నటన నేర్చుకుంటుంది. ఐరన్ లెగ్ బ్యూటీ గోల్డెన్ లెగ్గవుతుంది. ఆఫర్ల కోసం వెయిట్ చేసిన బ్యూటీకి ఆఫర్స్ వస్తాయి. ఈ మాటలన్నీ విని తెగ సంబరపడిపోతందట మహేశ్ బ్యూటీ కృతిసనన్. అదేంటి సల్మాన్ కు కృతికి సంబంధం ఏంటి? ఇప్పటి వరకూ ఇద్దరూ కలసిన సందర్భమే లేదే అంటారా?
తెలుగులో మహేశ్ వన్, నాగచైతన్య దోచెయ్ తో టాలీవుడ్ ప్రియుల మనసు దోచుకోలేకపోయిన కృతి...బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కూడా అదృష్టం కలసిరాలేదు. ఆ బాధలో ఉన్న బ్యూటీకి . షారుఖ్, కాజల్ జంటగా నటిస్తున్న దిల్ వాలే లో వరుణ్ ధావన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. ఇది సక్సెస్ అయిత కెరీర్ కాస్త గాడిన పడుతుందిలే అనుకుంది. కానీ అదృష్టం వెంటనే తలుపుతట్టిందని టాక్.
ప్రస్తుతం సల్మాన్ బజ్ రంగీ బాయీజాన్ మూవీలో నటిస్తున్నాడు. ఆ తర్వాత యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో సుల్తాన్ సినిమాకి డేట్స్ ఇచ్చాడట. అందులో హీరోయిన్ గా కంగనా, పరిణితి చోప్రా రేసులో ఉన్నా...కృతి పేరుకూడా వినిపిస్తోందట. అంతదాకా వస్తే కృతి ని సల్మాన్ రికమండ్ చేస్తున్నాడని బీటౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే అమ్మడి రొట్టి విరిగి నేతిలో పడ్డట్టే మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



