బాహుబలి టాక్... బయటకు చెప్పొద్దు!
on Jun 23, 2015
.jpg)
బాహుబలి విషయంలో రాజమౌళి ఎంత ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పటి వరకూ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్ని పద్ధతిగా తెలివిగా చేసుకొచ్చాడు రాజమౌళి. సెన్సార్ విషయంలో అతని తెగువ కూడా కనిపిస్తుంది.
పెద్ద సినిమాలకు సాధారణంగా ఓ వారం ముందు, లేదంటే నాలుగు రోజుల ముందు సెన్సార్ చేయిస్తారు. కానీ బాహుబలి విడుదలకు 18 రోజుల ముందే సెన్సార్ అయిపోయింది. సినిమాకి సెన్సార్ అయితే.. ఏదోలా టాక్ బయటకు వస్తుంది. సినిమా అలా ఉందట, ఇలా ఉందట అంటూనే సినిమాకి సంబంధించిన కీలక అంశాలు లీక్ చేస్తుంటారు. మీడియాకీ, సెన్సార్‌కీ మధ్య ఉన్న లిరేషన్‌తో సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది.
అయితే... ఆ భయం కూడా రాజమౌళికి లేదు. ఎందుకంటే సెన్సార్ సభ్యులకు ఈ సినిమా టాక్ ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు లీక్ చేయొద్ద`ని గట్టిగా చెప్పాడట. సెన్సార్ సభ్యుల్నందరినీ పేరు పేరునా పలకరించి.. వాళ్ల దగ్గర నుంచి మాట తీసుకొన్నాడని టాక్.'చాలా పెద్ద బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది. ఏ విషయంలో లీక్ చేసినా.. థ్రిల్ పోతుంది'' అంటూ అభ్యర్థించాడట. దాంతో సెన్సార్ సభ్యులు కూడా.. ''ఏ విషయం బయటకు రాకుండా చూస్తాం'' అని మాటిచ్చినట్టు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



