సాయిపల్లవి.. మరో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్?
on Aug 3, 2021
పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలకే ఓటేసే కథానాయికల్లో సాయిపల్లవి ఒకరు. మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో పలు నాయికా ప్రాధాన్యమున్న వేషాలు వేసింది ఈ డాన్సింగ్ సెన్సేషన్. అయితే మలయాళం, తెలుగు భాషల్లో మాదిరిగా తమిళంలో మాత్రం తనకి ఇంకా విజయాలు దక్కలేదు. `దియా` (తెలుగులో `కణం`), `మారి 2`, `ఎన్జీకే`.. ఇలా సాయిపల్లవి నటించిన కోలీవుడ్ ప్రాజెక్ట్స్ అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా సాయిపల్లవి మరో తమిళ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. `దియా` తరహాలో ఇది కూడా ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని బజ్. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీని గౌతమ్ రామచంద్రన్ తెరకెక్కించనున్నాడని సమాచారం. అంతేకాదు.. ఇందులో నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో కనిపించబోతోందట సాయిపల్లవి. మరి.. ఈ చిత్రంతోనైనా సాయిపల్లవి తమిళనాట ఫస్ట్ సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.
కాగా, సాయిపల్లవి నటించిన తెలుగు చిత్రాలు `లవ్ స్టోరి`, `విరాటపర్వం`, `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ పూర్తిచేసుకున్నాయి. ఈ మూడు సినిమాల్లోనూ ఒకదానితో ఒకటి పొంతన లేని పాత్రల్లో దర్శనమివ్వబోతోంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
Also Read