నానికి విలన్గా సాయిపల్లవి?
on Jun 25, 2021
`ఎంసీఏ`(2017) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నేచురల్ స్టార్ నాని, డాన్సింగ్ సెన్సేషన్ సాయిపల్లవి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం `శ్యామ్ సింగ రాయ్`. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ పాత్ర కోసం బెంగాలీ బాబుగా దర్శనమివ్వనున్నాడు నాని. అలాగే బెంగాలీ యువతి పాత్రలో సాయిపల్లవి కనిపించనుంది. కాగా, `శ్యామ్ సింగ రాయ్`లో సాయిపల్లవి పాత్రకి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో సాయిపల్లవిది నెగటివ్ రోల్ అట. అంతేకాదు.. సాయిపల్లవి విలనిజమే ఈ సినిమాకి ప్రధాన బలం అని అంటున్నారు. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా `శ్యామ్ సింగ రాయ్`కి సంబంధించిన చివరి షెడ్యూల్ మొదలైంది. చకచకా చిత్రీకరణ పూర్తిచేసి డిసెంబర్ లో ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
`శ్యామ్ సింగ రాయ్`లో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి, `ప్రేమమ్` ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ నాయికలుగా నటిస్తున్నారు. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బాణీలు అందిస్తున్నారు.