బన్నీకి చెల్లెలుగా చిన్ని?
on Jan 6, 2021

ఎలాంటి పాత్రల్లోనైనా ఒదిగిపోయే ఈతరం నటీమణుల్లో సాయిపల్లవి ఒకరు. ప్రేమమ్ టు పావై కథగళ్ (ఆంథాలజీ).. ఇలా ఇప్పటివరకు సాయిపల్లవి నటించిన సినిమాలన్నీ నటిగా తనకి మంచి పేరు తీసుకువచ్చినవే. వీటన్నింటిలోనూ ఎంసీఏ చిత్రంలో చేసిన చిన్ని పాత్ర ఒక్కటే పూర్తిస్థాయి సరదా పాత్ర. కట్ చేస్తే.. ఇలాంటి ఫన్ రోల్ నే ఓ స్టార్ హీరో సినిమాలో చేయబోతోందట సాయిపల్లవి.
ఆ వివరాల్లోకి వెళితే.. ఆర్య, ఆర్య 2 తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప పేరుతో థర్డ్ జాయింట్ వెంచర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్న నాయికగా నటిస్తోంది. కాగా, ఈ సినిమాలో కథానాయకుడి చెల్లెలు పాత్ర ఒకటుందని.. ఫన్నీగా సాగుతూ ఎమోషనల్ టచ్ ఇచ్చే ఈ రోల్ లో సాయిపల్లవిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాలీవుడ్ టాక్. మరి.. బన్నీకి చెల్లెలుగా చిన్ని ఏ స్థాయిలో మెప్పిస్తుందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. త్వరలోనే సాయిపల్లవి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో పుష్ప తెరపైకి వచ్చే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



