'సాహో' సర్‌ప్రైజ్ హిట్టా? ఫట్టా?
on May 21, 2019

'సాహో' సర్‌ప్రైజ్ వచ్చింది. సినిమాలో ప్రభాస్ లుక్ ఒకటి విడుదల చేశారు. సారీ.... ప్రభాస్ స్వయంగా తన లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. ఈ లుక్ అభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇచ్చిందా? లేదా? అనేది పక్కన పెడితే... లుక్‌తో పాటు ప్రభాస్ పెట్టిన కామెంట్‌తో ఓ స్పష్టత వచ్చింది. సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో "ఆగస్టు 15న థియేటర్లలో యాక్షన్ మొదలవుతుంది" అని ప్రకటించడంతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. మరి, సర్‌ప్రైజ్ సంగతేంటి? హిట్టా... ఫట్టా?? సర్‌ప్రైజ్ పేరుతో పోస్టర్ విడుదల చేశారంతే! అందులో ప్రభాస్ ఇంటెన్స్ లుక్ ఇచ్చాడు. మామూలుగా అయితే అభిమానులు నచ్చేదే. కానీ, ఈ లుక్ కంటే ఎక్కువ విషయాన్ని మేకింగ్ వీడియోస్ రూపంలో 'సాహో చాప్టర్ 1, చాప్టర్ 2'గా విడుదల చేశారు. వాటిలో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ మేకింగ్ ముందు ఈ లుక్ పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వలేదని చెప్పాలి. 'బాహుబలి' తరవాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో... 'సాహో'పై, ఈ సినిమా నుంచి ప్రతి అప్‌డేట్‌పై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



