మహేష్‌కి ఓ హిట్టిస్తే మరొకటి గ్యారెంటీ
on May 22, 2019

పండగలకు పబ్బాలకు షాపింగ్ మాల్స్‌లో స్పెషల్ ఆఫర్లు పెడతారు. వన్ ప్లస్ వన్, మూడు కొంటే రెండు ఉచితం, ఎంఆర్‌పి మీద ఫ్లాట్ డిస్కౌంట్ ఇలా! సూపర్‌స్టార్ మహేష్‌బాబు దగ్గర ఇటువంటి ఆఫర్ ఒకటి ఉంది. ఎవరైనా దర్శకుడు ఆయనకు ఒక హిట్ ఇస్తే... ఆ దర్శకుడికి మహేష్‌తో మరో సినిమా చేసే అవకాశం వస్తుంది. ప్లాప్ ఇస్తే కష్టమే. అందుకు ఉదాహరణ... గుణశేఖర్, పూరి, కొరటాల, శ్రీకాంత్ అడ్డాల తదితరులు. తాజాగా ఈ లిస్టులో వంశీ పైడిపల్లి కూడా చేరాడు. గుణశేఖర్ దర్శకత్వంలో 'ఒక్కడు', 'అర్జున్', 'సైనికుడు' చేశాడు. 'పోకిరి' హిట్ తరవాత పూరి జగన్నాథ్‌కి 'బిజినెస్‌మేన్' అవకాశం ఇచ్చాడు మహేష్. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తరవాత శ్రీకాంత్ అడ్డాలతో 'బ్రహ్మోత్సవం', 'శ్రీమంతుడు' తరవాత కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చేశాడు. 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి మహేష్ సూత్రప్రాయంగా అంగీకరించాడట. 'మహర్షి' టాక్‌తో సంబంధం లేకుండా మహేష్ బాబు సినిమాపై విపరీతంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా తరవాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రెండో సినిమా చేస్తాడో? మరో సినిమా చేసి వంశీతో సినిమా చేస్తాడో? ఎందుకంటే... పరశురామ్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు కూడా మహేష్ చుట్టూ తిరుగుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



